Andhra Pradesh: విశాఖలో ప్రభుత్వ ఇసుక రీచ్ ను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్!

  • కొత్త పాలసీపై కసరత్తు జరుగుతోంది
  • రాబోయే రెండ్రోజుల్లో దీన్ని ప్రకటిస్తాం
  • విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి 

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇసుక పాలసీపై కసరత్తు జరుగుతోందని ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్(అవంతి శ్రీనివాస్) తెలిపారు. ఇసుక పాయింట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇసుకను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రెవెన్యూ, మైనింగ్ శాఖలు ఈ బాధ్యతలను సంయుక్తంగా చూస్తాయని పేర్కొన్నారు.

విశాఖపట్నంలోని ముడుసర్ లోవలో ఈరోజు ప్రభుత్వ ఇసుక రీచ్ ను అవంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తెచ్చేవరకూ పాత విధానమే నడుస్తుందని తెలిపారు. ఇసుక పాలసీ విధివిధానాలను రాబోయే రెండ్రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. 

Andhra Pradesh
Visakhapatnam District
avanti
government sand reach
minister
YSRCP
  • Loading...

More Telugu News