Krishna River: మట్టపల్లి నరసింహస్వామి గర్భగుడిలోకి ప్రవేశించిన కృష్ణమ్మ!

  • పులిచింతల నుంచి భారీగా నీటి విడుదల
  • భక్తులకు దర్శనాల నిలిపివేత
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు

కృష్ణానదిపై నాగార్జున సాగర్ దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీటిని విడుదల చేస్తుండటంతో, నల్గొండ జిల్లాలో నదీ తీరాన ఉన్న మఠంపల్లి మండలంలోని మట్టపల్లి నరసింహస్వామి దేవాలయం ముంపునకు గురైంది. నిన్న సాయంత్రం గుడి ఆవరణలోకి వచ్చిన వరద, నేడు మరింత పెరిగి, స్వామి గర్భాలయంలోకి చేరింది. దీంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని అధికారులు నిలిపివేశారు. ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం నదిలో ఏడున్నర లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ వరద మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున మఠంపల్లి, సూర్యాపేట, కోదాడ తదితర మండలాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

Krishna River
Flood
Mattapalli
Temple
  • Loading...

More Telugu News