rapist: మధిర పోలీసుల కస్టడీలో నరరూప రాక్షసుడు అంకమరావు!

  • ఏకాంతంగా కనిపించే ప్రేమికులే అతడి లక్ష్యం
  • హత్యలు, అత్యాచారాలే జీవితం
  • తొర్లపాడు హత్య కేసులో అంకరావును విచారిస్తున్న పోలీసులు

ఏకాంతంగా కనిపించే ప్రేమికులను వేటాడి యువకులను చంపి, అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడే నరరూప రాక్షసుడు, రేపిస్టు రాజు అలియాస్ అంకమరావు (35)ను ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధిర పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నూజివీడు శివారులో ఆమధ్య జరిగిన ఓ అత్యాచారం కేసులో నిందితుడు అంకమరావును కొన్నాళ్ల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గత కొంత కాలంగా అతను నెల్లూరు జిల్లా జైలులో ఉన్నాడు.

అయితే, మధిర మండలంలోని తొర్లపాడు సమీపంలోని సుబాబుల్ తోటలో ఓ వ్యక్తిని హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేసిన కేసులో అంకమరావుపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు పీవోటీ ద్వారా అతడిని నెల్లూరు నుంచి తెచ్చి, మధిర కోర్టులో హాజరు పరిచారు. ఈ హత్య కేసులో విచారించేందుకే అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిందితుడిపై పలు ప్రాంతాల్లో అత్యాచార కేసులు నమోదయ్యాయి.

rapist
ankamarao
Andhra Pradesh
Khammam District
madhira
  • Loading...

More Telugu News