Kshanakshanam: కొత్త గొంతుల్లో 'జామురాతిరి జాబిలమ్మా' పాట

  • అప్పట్లో క్షణక్షణం చిత్రంలో బాలు, చిత్రలు పాడిన పాట
  • నేడు టాలీవుడ్ యువ గాయకుల గొంతుకలో పునఃప్రాణప్రతిష్ఠ
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న వీడియో

దాదాపు మూడు దశాబ్దాల కిందట వచ్చిన 'క్షణక్షణం' చిత్రం తిరుగులేని మ్యూజికల్ హిట్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎంఎం కీరవాణి తన ఫ్రెష్ నెస్ తో అందించిన ఆ సినిమా బాణీలు ఇప్పటికీ తాజాగా వీనులవిందుగా ఉంటాయి. ముఖ్యంగా 'జామురాతిరి... జాబిలమ్మా' అంటూ సాగే మెలోడీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. ఎస్పీ బాలు, చిత్రల గంధర్వ గాత్రం నుంచి జాలువారిన ఆ గీతం ఇప్పుడు కొత్త గొంతుల్లో మరోసారి పునఃప్రాణప్రతిష్ఠ జరుపుకుంది.

నేటితరం టాలీవుడ్ గాయకులు హేమచంద్ర, దీపూ, కాలభైరవ (కీరవాణి తనయుడు), దామిని, నోయల్, పృథ్వీ, శ్రుతి, మౌనిమ ఎంతో హృద్యంగా జామురాతిరి జాబిలమ్మ పాటను ఆలపించారు. ఇప్పుడీ కొత్త పాటకు సంబంధించిన వీడియోకి సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. కీరవాణి కుటుంబానికి చెందిన వేల్ రికార్డ్స్ ద్వారా ఈ వీడియో ప్రాచుర్యంలోకి వచ్చింది.

Kshanakshanam
Jamurathiri
Song
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News