Rapaka: మరోసారి వార్తల్లోకెక్కిన రాపాక... మామిడికుదురు ఎంపీడీవోపై ఆగ్రహం

  • స్వాతంత్ర్యదిన వేడుకలకు తనను పిలవకపోవడంపై రాపాక అసంతృప్తి
  • జనసేన ఎమ్మెల్యేని కాబట్టే ఆహ్వానించకుండా అవమానించారని వ్యాఖ్యలు
  • స్పీకర్, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానన్న ఎమ్మెల్యే 

మలికిపురం పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన వ్యవహారం సద్దుమణిగిందో లేదో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి వార్తల్లోకెక్కారు. మామిడికుదురు ఎంపీడీవోపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడ్నయిన తనను స్వాతంత్ర్యదిన వేడుకలకు ఆహ్వానించలేదంటూ రాపాక మండిపడ్డారు. జనసేన ఎమ్మెల్యేని కాబట్టే పిలవకుండా అవమానించారని ఆరోపించారు. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని రాపాక స్పష్టం చేశారు.

Rapaka
Jana Sena
  • Loading...

More Telugu News