Jagan: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తొలిసారి 'ఎట్ హోమ్'... హాజరైన సీఎం జగన్

  • ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం
  • అన్ని పార్టీలను ఆహ్వానించిన గవర్నర్ బిశ్వభూషణ్  
  • వైసీపీ మంత్రులు, టీడీపీ, బీజేపీ నేతల రాక

ఏపీలో 'ఎట్ హోమ్' కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు వైసీపీ మంత్రులు, టీడీపీ, బీజేపీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 'ఎట్ హోమ్' కార్యక్రమం ఏపీలో నిర్వహించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు హైదరాబాద్ లోనే 'ఎట్ హోమ్' నిర్వహించగా, తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యేవారు. ఇటీవలే ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమించడంతో ఈసారి 'ఎట్ హోమ్' కార్యక్రమం ఏపీలోనే నిర్వహించారు.

Jagan
Andhra Pradesh
Governor
At Home
Raj Bhavan
  • Loading...

More Telugu News