Andhra Pradesh: చంద్రబాబు ఇంట్లో స్వాతంత్ర్య దిన వేడుకలు.. పాల్గొన్న టీడీపీ అధినేత, లోకేశ్, దేవాన్ష్!

  • హైదరాబాద్ లోని నివాసంలో జెండా ఆవిష్కరణ
  • మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు
  • ట్విట్టర్ లో వివరాలు పంచుకున్న లోకేశ్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు స్వాతంత్ర్య దిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని ఇంట్లో చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ చిత్రపటానికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, మనవడు దేవాన్ష్, ఇతర టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆనాటి మహానుభావుల స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని లోకేశ్ తెలిపారు. 

Andhra Pradesh
Telugudesam
Telangana
Hyderabad
Chandrababu
Nara Lokesh
devansh
Independence day
  • Error fetching data: Network response was not ok

More Telugu News