Shivaganesh: టాలీవుడ్ లిరిక్ రైటర్ శివగణేశ్ హఠాన్మరణం

  • గుండెపోటుతో కన్నుమూత
  • ప్రేమికుల రోజు, జీన్స్ చిత్రాలతో గుర్తింపు
  • దాదాపు 1000కి పైగా పాటలు రాసిన శివగణేశ్

ప్రేమికుల రోజు, జీన్స్, బాయ్స్, నరసింహ, 7జీ బృందావన్ కాలనీ, ఆస్తి మూరెడు ఆశ బారెడు వంటి చిత్రాలకు పాటలు రాసిన గీత రచయిత శివగణేశ్ హఠాన్మరణం చెందారు. ఆయన బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసినట్టు తెలిసింది. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఉన్న తన నివాసంలో ఆయన మరణించారు. శివగణేశ్ కు భార్య నాగేంద్రమణి, ఇద్దరు కుమారులు (సుహాస్, మానస్) ఉన్నారు. శివగణేశ్ తెలుగులోనే కాకుండా తమిళ చిత్ర రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దాదాపు 1000కి పైగా పాటలు రాశారు.

Shivaganesh
Tollywood
Lyric Writer
  • Loading...

More Telugu News