India: వన్డే సిరీస్ క్లీన్ స్వీప్... కోహ్లీ సెంచరీతో గెలుపు సునాయాసం!

  • పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ లో మూడో వన్డే
  • ఆటకు పలుమార్లు వర్షంతో అంతరాయం
  • 114 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కోహ్లీ

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ లో బుధవారం నాడు వెస్టిండీస్‌ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించి వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేల సిరీస్‌ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండు, మూడు మ్యాచ్ లను కోహ్లీ సేన గెలుచుకుంది. తాజా మ్యాచ్ లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు దిగిన వెస్టిండీస్‌ జట్టులో ఓపెనర్లు గేల్, లూయిస్ లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పది ఓవర్లు దాటకుండానే వారి స్కోరు 100 పరుగులను దాటేయడం గమనార్హం.

ఆపై పలుమార్లు వర్షం కారణంగా ఆటకు ఆటంకం ఏర్పడగా, 35 ఓవర్లకు లక్ష్యాన్ని కుదించగా, విండీస్ జట్టు 240 పరుగులు చేసింది. డక్వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం, 35 ఓవర్లలో భారత లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ణయించారు. కెప్టెన్ కోహ్లీ 114 పరుగులతో అజేయంగా నిలవడంతో ఈ లక్ష్యాన్ని భారత్ 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తన కెరీర్ లో 43వ సెంచరీ సాధించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

  • Loading...

More Telugu News