Telangana: తెలంగాణ ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: భట్టి విక్రమార్క

  • రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు
  • కేంద్ర ప్రభుత్వమైనా పట్టించుకోవాలి
  • ఈ నెల 19 నుంచి జిల్లా కేంద్రాల్లో ఆసుపత్రులను సందర్శిస్తా

తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రోగాల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని, కనీసం, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ నెల 19 నుంచి జిల్లా కేంద్రాల్లో ఆసుపత్రులను సందర్శిస్తానని, కాంగ్రెస్ పార్టీ తరపున మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని అన్నారు. కేసీఆర్ తన రాజమహల్ నుంచి బయటకొచ్చి చూస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయని విమర్శించారు.

Telangana
Bhatti vikramarka
Health emergency
  • Loading...

More Telugu News