Telugu tv acters: తెలుగు సీరియళ్లలో తెలుగు వారికే అవకాశం ఇవ్వాలి: ఆర్టిస్ట్స్ అసోసియేషన్

  • సీరియల్ నటుల ‘తెలుగు సీరియళ్లలో తెలుగు నటీనటులు’ నినాదం
  • అవకాశాలు లేక నటులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన
  • టెలివిజన్ యాజమాన్యాలు, నిర్మాతల కౌన్సిల్‌కు వినతి పత్రాలు

తెలుగు టీవీ సీరియళ్లలో తెలుగు నటులనే తీసుకోవాలని ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ సభ్యులు కోరారు. తెలుగు సీరియళ్లలో పరభాషా నటీనటులను తీసుకోవడం వల్ల తెలుగు వారికి అవకాశాలు కరవై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తెలుగు ధారావాహికల్లో తెలుగు వారికే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం అసోసియేషన్ ప్రతినిధులు టెలివిజన్ యాజమాన్యాలు, నిర్మాతల కౌన్సిల్‌కు వినతి పత్రాలు అందజేశారు. ‘తెలుగు సీరియళ్లలో తెలుగు నటీనటులు’ నినాదంతో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నటీనటుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇకపై తెలుగు నటీనటులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

Telugu tv acters
serials
Hyderabad
  • Loading...

More Telugu News