Rapaka: స్టేషన్ బెయిల్ పై బయటికి వచ్చిన ఎమ్మెల్యే రాపాక

  • పోలీస్ స్టేషన్ పై దాడి చేశారంటూ రాపాకపై కేసు నమోదు
  • కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • ఈ కేసు తమ పరిధిలోకి రాదన్న రాజోలు న్యాయస్థానం
  • విజయవాడ ప్రత్యేక కోర్టుకు వెళ్లాలంటూ సూచన

మలికిపురం పోలీస్ స్టేషన్ పై తన అనుచరులతో కలిసి దాడి చేశారంటూ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోగా రాజోలు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ కోర్టు స్పష్టం చేసింది. రాపాక ఓ ప్రజాప్రతినిధి కాబట్టి విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు వెళ్లాలని పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలో, ఎమ్మెల్యేకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని కూడా చెప్పడంతో, పోలీసులు రాపాక వరప్రసాద్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చారు.  

దాంతో ఆయన బయటికి రావడంతో అనుచరులు హర్షధ్వనాలతో స్వాగతం పలికారు. కాగా, రాపాకకు బెయిల్ రాకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజోలు రావాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే ఇప్పుడు రాపాకకు బెయిల్ రావడంతో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్టు సమాచారం.

Rapaka
Jana Sena
Bail
Pawan Kalyan
  • Loading...

More Telugu News