Anna canteens: అన్న క్యాంటీన్ల పేరుతో పెట్టని భోజనాలకు కూడా లెక్కలు రాసుకున్నారు: వైసీపీ నేత రవిచంద్రారెడ్డి

  • అన్న క్యాంటీన్ల పేరుతో చంద్రబాబు స్కామ్ చేశారు
  • 10 మందికి భోజనం పెడితే 100 మందిగా రాసుకున్నారు
  • టీడీపీ హయాంలో చేసిన ఏ స్కామ్ నూ వదలం

అన్న క్యాంటీన్ల పేరుతో కూడా మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్కామే చేశారని, వైసీపీ నేత రవిచంద్రారెడ్డి ఆరోపించారు. టీడీపీ హయాంలో జరిగిన ఏ స్కామ్ ను కూడా తాము కంటిన్యూ కానివ్వమని, పేదలకు భోజనం పేరుతో పది మందికి భోజనం పెడితే వంద మంది అని రాసుకున్నారని, వంద మంది అయితే వెయ్యిమంది అని రాసుకున్నారని ఆరోపించారు. పెట్టని భోజనాలకు లెక్కలు రాసుకుంటే చూస్తూ ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం ఎక్కడెక్కడ అవినీతి చేసిందో వాటికి సంబంధించిన విచారణలు కచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. 

Anna canteens
Chandrababu
Ramachandra reddy
  • Loading...

More Telugu News