Jammu And Kashmir: జమ్ము, కశ్మీర్ తో పాటు ఏపీ, తెలంగాణాలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సీఈసీ చర్చ
- కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు
- సీఈసీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం
- అసెంబ్లీ సీట్ల పెంపుపై కమిషన్ ఏర్పాటు చేసే యోచన
జమ్ము,కశ్మీర్ పునర్విభజన ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము, కశ్మీర్; అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా, జమ్ము, కశ్మీర్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. సీఈసీ సునీల్ అరోరా నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.
జమ్ముకశ్మీర్ పునర్విభజన, సీట్ల పెంపు అవకాశంపై చర్చించింది. అసెంబ్లీ సీట్ల పెంపుపై కమిషన్ ఏర్పాటు చేసే యోచనలో ఈసీ ఉన్నట్టు సమాచారం. కేంద్రం నుంచి నోటిఫికేషన్ రాగానే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా, ఏపీ, తెలంగాణ, సిక్కిం రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల పెంపు విషయం చర్చకు వచ్చినట్టు సమాచారం.