Andhra Pradesh: ‘రైతు భరోసా’ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించాం: సీఎం వైఎస్ జగన్

  • సెప్టెంబర్ నుంచి జిల్లాల్లో పర్యటిస్తా
  • ప్రభుత్వ పథకాల అమలు తీరును నేరుగా పర్యవేక్షిస్తా
  • ‘స్పందన’పై సమీక్షించిన జగన్

ఏపీలో ‘రైతు భరోసా’ పథకం త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. సెప్టెంబర్ నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని, ప్రభుత్వ పథకాల అమలు తీరును నేరుగా పర్యవేక్షిస్తానని అన్నారు.

ఏపీ ప్రభుత్వ కార్యక్రమం ‘స్పందన’పై ఆయన సమీక్షించారు. ‘స్పందన’ కింద వచ్చే వినతుల సంఖ్య బాగా పెరుగుతోందని చెప్పారు. ప్రజల సమస్యలపై స్పందిస్తున్నందునే వినతుల సంఖ్య పెరిగిందని, క్రమం తప్పకుండా కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు ఫోన్ చేసి వారి అభిప్రాయాలను తీసుకుంటామని, కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మార్వోలు, ఎస్ఐలు బాగా స్పందిస్తున్నారా? లేదా? అనే విషయం తెలుసుకుంటామని, సర్వేలు చేస్తామని చెప్పారు. తొంభై శాతం వినతులు పరిష్కారం అవుతున్నాయని, ప్రజల్లో అసంతృప్తి స్థాయి అన్నది ఒక్క శాతం కన్నా తక్కువగా ఉండాలని, కలెక్టర్ నుంచి దిగువస్థాయి అధికారి వరకూ దీన్ని లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News