Andhra Pradesh: ఏపీలో పెట్టుబడులకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది: మంత్రి బొత్స

  • విశాఖలో ప్రాంతీయ పర్యాటక పెట్టుబడులు, పారిశ్రామికవేత్తల సదస్సు
  • పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయం
  • పర్యాటక అభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలి

ఏపీలో పెట్టుబడులకు ప్రభుత్వం ఆహ్వానిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖలో ప్రాంతీయ పర్యాటక పెట్టుబడులు, పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రులు బొత్స, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని, ఉత్తరాంధ్ర, విశాఖలో పర్యాటక అభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని, తీరం వెంట పర్యాటక పెట్టుబడులకు అనుకూలంగా ఉందని అన్నారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యాటకంగా విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. ఢిల్లీ-విశాఖ మధ్య విమానాల రాకపోకలను పునరుద్ధరించేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.

Andhra Pradesh
vizag
Ministers
Botsa Satyanarayana
Avanthi
  • Loading...

More Telugu News