GVL: జమ్మూకశ్మీర్ వెళతానని ప్రకటించిన రాహుల్ గాంధీకి జీవీఎల్ కౌంటర్

  • కశ్మీర్ లో పర్యటించేందుకు రాహుల్ సన్నద్ధం
  • రాహుల్ లిఖితపూర్వక హామీ ఇవ్వాలంటూ జీవీఎల్ డిమాండ్
  • పాక్ ప్రధానికి కాంగ్రెస్ నేతలు వంతపాడుతున్నారంటూ ఆగ్రహం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో ప్రజల మనోభావాలు తెలుసుకునేందుకు వెళతానని ప్రకటించిన రాహుల్ గాంధీకి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ లో బదులిచ్చారు. జమ్మూకశ్మీర్ లో అడుగుపెట్టే ముందు రాహుల్ గాంధీ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ అనుకూల భావజాలాన్ని తలకెత్తుకోబోమని, జమ్మూకశ్మీర్ లో పర్యటించే అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోబోమని స్పష్టం చేయాలని జీవీఎల్ పేర్కొన్నారు. వరస చూస్తుంటే కాంగ్రెస్ నేతలు పాక్ ప్రధాని ఇమ్రాన్ కు వంతపాడుతున్నట్టుందని విమర్శించారు. ఇమ్రాన్ ఖాన్ ఏం చెబితే, ఇక్కడి కాంగ్రెస్ నేతలు అదే వల్లించడం ఎక్కువైందని ట్వీట్ చేశారు.

GVL
Rahul Gandhi
Jammu And Kashmir
Congress
BJP
  • Loading...

More Telugu News