Buddha Venkanna: 'లోకేశ్ గారు 150 కోట్లు ఖర్చుపెట్టారు' అంటున్నారు, మీరేమన్నా పక్కనే ఉండి లెక్కపెట్టి ఇచ్చారా?: విజయసాయిపై బుద్ధా ఫైర్

  • లోకేశ్ పై వైసీపీ ఆరోపణలు
  • తీవ్రంగా స్పందించిన బుద్ధా వెంకన్న
  • 'సెల్ఫ్ గోల్ విజయసాయిరెడ్డి గారూ' అంటూ వ్యంగ్యం

టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. "సెల్ఫ్ గోల్ విజయసాయిరెడ్డిగారూ, లోకేశ్ గారు ఎన్నికల్లో రూ.150 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపిస్తున్నారు, మీరేమైనా ఆ డబ్బును లెక్కబెట్టి ఇచ్చారా? మీలాగా అవినీతి శతకాలు వల్లెవేయలేదు కాబట్టే లోకేశ్ గారు ఓడిపోయి ఉండొచ్చేమో కానీ, మీలా ప్రతి నియోజకవర్గంలో రూ.18 కోట్లు మాత్రం కుమ్మరించలేదు, అందుకు మీ ఉండి రాజుగారే సాక్షి" అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి నరసింహరాజు ఓ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పార్టీ నుంచి ప్రతి అభ్యర్థికి రూ.10 కోట్ల నుంచి రూ.18 కోట్లు అందాయన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం.

Buddha Venkanna
Vijay Sai Reddy
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News