Janasena: పోలీసుల ముందు లొంగిపోనున్న జనసేన ఎమ్మెల్యే రాపాక!

  • మలికిపురం స్టేషన్ పై దాడి
  • 100 మందితో వచ్చి రాపాక దౌర్జన్యం
  • ఏ-1గా కేసు నమోదు

తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ పై దాడికి యత్నించారన్న ఆరోపణలపై కేసు నమోదు కావడంతో, రాపాక ఎమ్మెల్యే, జనసేన నేత వరప్రసాద్, మలికిపురం పోలీసుల ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. పేకాడుతూ పట్టుబడిన వారికి వత్తాసు పలకడమే కాకుండా, 100 మంది అనుచరులతో వచ్చి, పోలీసులపై దౌర్జన్యం చేసి, ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. ఈ ఘటనలో స్టేషన్ పై ఎమ్మెల్యే అనుచరులు రాళ్లు రువ్వారు. కిటికీల అద్దాలను పగులగొట్టారు. ఈ దాడి కేసులో ఏ-1గా రాపాక వరప్రసాద్ పేరునే చేర్చడంతో, ఆయన మరికాసేపట్లో లొంగిపోనున్నట్టు సమాచారం.

Janasena
ML
Rapaka
Malikipuram
  • Loading...

More Telugu News