Team India: టీమిండియా కోచ్ పదవికి ఆరుగురిని షార్ట్‌లిస్ట్ చేసిన సీఏసీ
- టీమిండియా కోచ్ పదవి కోసం వేలాది దరఖాస్తులు
- రవిశాస్త్రి సహా ఆరుగురిని ఫైనల్ చేసిన సీఏసీ
- ఈ వారాంతంలో తుది ప్రకటన
భారత జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం వేలాదిగా దరఖాస్తులు రాగా, అందులో ఆరుగురిని ఫైనల్ ఇంటర్వ్యూల కోసం ఎంపిక చేసినట్టు క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) తెలిపింది. వీరిలో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితోపాటు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, శ్రీలంక కోచ్ టామ్ మూడీ, విండీస్ మాజీ ఆల్‌రౌండర్, ఆఫ్ఘనిస్థాన్ కోచ్ ఫిల్ సిమన్స్, టీమిండియా మాజీ మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుట్, టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ శర్మ ఉన్నారు.
లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని సీఏసీ ముందు వీరు హాజరై తమ ప్రజెంటేషన్ ఇస్తారు. ఈ వారాంతంలో కానీ, తర్వాతి వారంలో కానీ కోచ్ విషయంలో తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది.