western railway: నేటి నుంచి.. సికింద్రాబాద్ నుంచి నడిచే పలు రైళ్లు రద్దు

  • పశ్చిమ, దక్షిణ మధ్య భారతదేశంలో వరదలు
  • పలు ప్రాంతాల్లో నీట మునిగిన పట్టాలు
  • నేటి నుంచి ఈ నెల 19 వరకు పలు రైలు సర్వీసులు రద్దు

సికింద్రాబాద్ నుంచి నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. పశ్చిమ, దక్షిణ మధ్య భారతదేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పశ్చిమ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు 14 రైళ్లను, రేపు 13, 15న 8, 16న 5, 17,18 తేదీల్లో 3, 19న ఒక రైలు సర్వీసును రద్దు చేసినట్టు పేర్కొంది. భారీ వర్షాల కారణంగా ఇంకా పలు ప్రాంతాలు నీటి ప్రవాహంలో ఉండడం, పట్టాలు నీట మునగడం వంటి కారణాలతోనే రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

నేడు సికింద్రాబాద్ నుంచి రాజ్‌కోట్ వెళ్లాల్సిన రైలుతోపాటు, పోర్‌బందర్-సికింద్రాబాద్ రైలు, రేపు రాజ్‌కోట్ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి పోర్‌బందర్ వెళ్లాల్సిన రైళ్లు రద్దయ్యాయి. అలాగే,  15న రాజ్‌కోట్‌-సికింద్రాబాద్‌, 17న ఇండోర్‌-లింగంపల్లి‌, 18న లింగంపల్లి-ఇండోర్‌ మధ్య నడవాల్సిన రైళ్లు రద్దయిన వాటి జాబితాలో ఉన్నాయి.

western railway
secunderabad
trains
rains
  • Loading...

More Telugu News