Nara Lokesh: మద్యం మానవ సంబంధాలని మంటగలుపుతుందని జగన్ గారు అన్నమాటను కోటంరెడ్డి నిజం చేశారు: నారా లోకేశ్

  • రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కోటంరెడ్డి వ్యవహారం
  • జమీన్ రైతు ఎడిటర్ పై కోటంరెడ్డి దాడిచేశాడంటూ పాత్రికేయుల ఆగ్రహం
  • ట్విట్టర్ లో స్పందించిన నారా లోకేశ్
  • వైసీపీ సంస్కృతే అలాంటిదంటూ వ్యాఖ్యలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ పై దాడి చేశాడంటూ మీడియాలో వస్తున్న కథనాలు పాత్రికేయులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తున్నాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు.  ఇదే శాసనసభ్యుడు అసెంబ్లీలో చంద్రబాబు గారిని 'ఖబడ్దార్' అన్నప్పుడు జగన్ ముసిముసిగా నవ్వుకున్నారని, ఇప్పుడా నవ్వు ముఖాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక అవస్థలు పడుతుంటే చూడడం తమకూ బాధగానే ఉందని లోకేశ్ ట్వీట్ చేశారు.

ఏదేమైనా వైసీపీ సంస్కృతే అలాంటిదని, మద్యం మానవ సంబంధాలను మంటగలుపుతుందని జగన్ గారు అన్న మాటలను కోటంరెడ్డి నిజం చేశారని వ్యాఖ్యానించారు. మందుకొట్టి ఓ పాత్రికేయుడి ఇంటికి వెళ్లడమే కాకుండా, అతడిని చంపుతానని బెదిరించి, జగన్ కూడా నన్నేమీ చేయలేడు అంటూ వైసీపీ చీఫ్ పరువు కూడా తీశాడని లోకేశ్ విమర్శించారు.

Nara Lokesh
Jagan
Kotamreddy
  • Loading...

More Telugu News