Kailash manasa: మానస సరోవర్ యాత్ర కొనసాగించాలన్న చైనా నిర్ణయంపై భారత్ హర్షం

  • చైనాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి  
  • ద్వైపాక్షిక చర్చలు జరిపిన ఉన్నతస్థాయి బృందం  
  • ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగింపునకు నిర్ణయం

చైనాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్   నిన్న ఆ దేశానికి చేరుకున్నారు. ఈరోజు ఆ దేశ ఉపాధ్యక్షుడు వాంగ్ ఖిషాన్ తో భేటీ అయ్యారు. అనంతరం, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉన్నతస్థాయి బృందం ద్వైపాక్షి చర్చలు జరిపింది. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు సుస్థిరంగా ఉండేలా అడుగులు వేయాలని గత భేటీలో ఇరు దేశాధినేతలు నిర్ణయించారని అన్నారు.

ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జమ్ముకశ్మీర్ అంశం పూర్తిగా అంతర్గత విషయమని ఈ సందర్భంగా చైనాకు తెలియజేసినట్టు సమాచారం. టిబెట్ పై ఉన్న ఉమ్మడి సంబంధాలు ఇకపైనా కొనసాగించాలని, ఆరోగ్య సౌకర్యాల పెంపునకు ఇరు దేశాలు ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని చైనా కోరినట్టు సమాచారం. ఇండో-చైనా సంబంధాల్లో భారత యువతకు ఎక్కువ స్థానం కల్పించాలని నిర్ణయించారని, ఈ మేరకు ఇరు దేశాలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని సంబంధిత వర్గాల సమాచారం.

జమ్ముకశ్మీర్ అంశం పూర్తిగా అంతర్గత విషయమన్న జైశంకర్ వ్యాఖ్యలకు వాంగ్ యీ స్పందిస్తూ, భారత్-పాక్ మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను చాలా దగ్గరగా గమనిస్తున్నామని చెప్పారు. ప్రాంతీయంగా శాంతి, సుస్థితర నెలకొల్పడంతో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ పర్యటనను ఈ పర్యటనలో ఖరారు చేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News