Jio: జియో టెలికాం సేవల కోసం వేసిన ఫైబర్ తో భూమిని 11 సార్లు చుట్టి రావొచ్చు: ముఖేశ్ అంబానీ
- ముంబయిలో రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం
- కీలక ప్రసంగం చేసిన ముఖేశ్
- గత ఐదేళ్లలో రూ.5.4 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టామని వెల్లడి
ముంబయిలో జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో తాము రూ.5.4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని, ముఖ్యంగా జియో టెలికాం సేవల కోసం భారీగా వెచ్చించామని తెలిపారు. రిలయన్స్ జియో కోసం వేసిన ఫైబర్ తో భూమిని 11 సార్లు చుట్టి రావొచ్చని వెల్లడించారు. 34 కోట్ల మంది జియో కస్టమర్లతో తామే అగ్రగాములం అని గర్వంగా చెప్పారు. ప్రతి నెల కోటి మంది జియో సభ్యత్వం పొందుతున్నారని ముఖేశ్ వివరించారు. భవిష్యత్ లో తమ సేవలను మరింత విస్తరిస్తామని సమావేశంలో స్పష్టం చేశారు.