Kalyani Priyadarshan: ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను: హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్

  • 'రణరంగం'లో నా పాత్ర నచ్చుతుంది
  • లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయాలని వుంది 
  • మెగా ఫోన్ పట్టుకోవాలని ఉందన్న కల్యాణి ప్రియదర్శన్ 

తెలుగు తెరకి 'హలో' సినిమా ద్వారా కల్యాణి ప్రియదర్శన్ పరిచయమైంది. ఆ సినిమా పరాజయంపాలు కావడం వలన, ఆశించినస్థాయిలో ఆమెకి ఇక్కడ అవకాశాలు రాలేదు. తాజాగా ఆమె చేసిన 'రణరంగం' సినిమా ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ, "హీరోయిన్ గా తెలుగులో మొదటి అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. 'రణరంగం'లోను మంచి పాత్రనే చేశాను. కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా చేయాలనేది నా కోరిక. అందుకు కొంత అనుభవం కావాలనే విషయం నాకు తెలుసనుకోండి. అలాగే మెగా ఫోన్ పట్టుకోవాలనే కోరిక కూడా బలంగానే వుంది. అందుకోసం ఇప్పటి నుంచే మంచి కథలు రెడీ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ రెండు కోరికలు ఎప్పుడు నెరవేరుతాయా అని ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.

Kalyani Priyadarshan
  • Loading...

More Telugu News