Andhra Pradesh: గత ప్రభుత్వ అవినీతిని కన్నా ఎందుకు ప్రశ్నించరు?: వైసీపీ ఎమ్మెల్యే కాసు

  •  వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా 16న కన్నా ధర్నా
  • ఈ ప్రకటనపై కాసు మహేశ్ రెడ్డి మండిపాటు
  • గత ప్రభుత్వ అవినీతిని కన్నా ఎందుకు ప్రశ్నించరు?

ఏపీలో వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 16న పల్నాడులో నిరసన దీక్ష చేపడతామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఈ నెల 16న గురజాలలో కన్నా ఎందుకు ధర్నా చేస్తానన్నారో అర్థం కావడం లేదు. గత ప్రభుత్వ అవినీతిని కన్నా ఎందుకు ప్రశ్నించరు? గతంలో టీడీపీ ప్రభుత్వం తమ ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెడితే కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు మాట్లాడలేదు? మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకాలు చేస్తే ధర్నా ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో టీడీపీలో ఉండి అరాచకాలు, అక్రమాలు చేసిన వారు ఇప్పుడు బీజేపీలోకి వెళ్లి తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, టీడీపీ దుర్మార్గాలను బీజేపీ ఇప్పటికైనా గ్రహించాలని విమర్శించారు. చంద్రబాబే తమ పార్టీ వారిని బీజేపీలోకి పంపుతున్నారని ఆరోపించారు.

Andhra Pradesh
Gurazala
YSRCP
kasu
kanna
  • Loading...

More Telugu News