Adivi Sesh: ఆ సినిమాలు ఫ్లాప్ .. నా నిర్ణయం కరెక్టే: నటుడు అడివి శేష్

  • 'క్షణం' తరువాత చాలా అవకాశాలు వచ్చాయి
  • కొన్ని కథలు నచ్చక వదిలేశాను 
  • నేను తప్పు చేయాలనిపించిందన్న శేష్ 

'క్షణం' సినిమాతో అడివి శేష్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి నుంచి ఆయన విభిన్నమైన కాన్సెప్టులను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా ఆయన చేసిన 'ఎవరు' ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. 'క్షణం' తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చిన సంస్థల్లో పెద్ద బ్యానర్లు కూడా వున్నాయి.

అయినా నాకు నచ్చకపోవడం వలన సున్నితంగా తిరస్కరించాను. నేను వదులుకున్న ఓ పది .. పదిహేను సినిమాలు, ఇతర హీరోలతో ప్రేక్షకుల ముందుకు వెళ్లాయి .. పరాజయాలు పొందాయి. అవి ఫ్లాప్ అయినందుకు నేను ఆనందపడలేదుగానీ, నా నిర్ణయం కరెక్టేనని అనిపించింది. కథల ఎంపిక విషయంలో నేను తప్పు చేయడం లేదు .. కరెక్టుగానే వెళుతున్నాను అని నాకు అనిపించింది" అన్నాడు.

Adivi Sesh
  • Loading...

More Telugu News