Nellore District: నాపై చేయి చేసుకున్న కోటంరెడ్డి ‘జగన్ కు పోయి చెప్పుకో..’ అన్నారు: డోలేంద్ర ప్రసాద్ ఆరోపణలు

  • కోటంరెడ్డి, ఆయన అనుచరులు మా ఇంటికి వచ్చారు
  • ఆయన అనుచరులు కూడా నాపై చేయి చేసుకున్నారు
  • ‘ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో’ అని కోటంరెడ్డి బెదిరించారు

తనపై అసత్య కథనాలు రాస్తున్నారంటూ ‘జమీన్ రైతు’ వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ ఇంటిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డోలేంద్ర ప్రసాద్ ను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, కోటంరెడ్డి, ఆయన అనుచరులు తన ఇంటికి వచ్చారని చెప్పారు.

కోటంరెడ్డికి చెందిన మనుషులు పది మంది తమ ఇంట్లోకి వచ్చి అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. కోటంరెడ్డి సహా ఆయన అనుచరులు తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. కోటంరెడ్డి తమ ఇంట్లో నుంచి వెళ్లిపోతూ ‘నిన్ను చంపేస్తాను’ అని బెదిరించడమే కాకుండా, పోలీసులకు చెప్పుకుంటావో, ఎస్పీకి చెప్పుకుంటావో లేకపోతే జగన్ కు చెబుతావో చెప్పుకో అని అన్నారని ఆరోపించారు. ‘జగన్ కు పోయి చెప్పుకో..జగన్ నన్నేమీ ..’ అంటూ వెళ్లిపోయారని ఆరోపించారు.

Nellore District
Rural mla
kotamreddy
Jaminu rythu
  • Loading...

More Telugu News