Jamin Rythu: జమీన్ రైతు వారపత్రిక అధినేత ఇంటిపై దాడి.. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి, అనుచరులపై కేసు నమోదు!

  • డోలేంద్ర ప్రసాద్ ఇంటిపై కోటంరెడ్డి అనుచరులు దాడి
  • వ్యతిరేక కథనాలు రాస్తున్నారంటూ దాడి
  • డోలేంద్ర ప్రసాద్ ను పరామర్శించిన మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరులపై పోలీస్ కేసు నమోదైంది. నిన్న రాత్రి కోటంరెడ్డి సహా ఆయన అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరులోని దుర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం ఈ కేసును విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఈ దాడి ఘటన గురించి తెలుసుకున్న నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు డోలేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. కాగా, వేదాయపాలెంలోని డోలేంద్ర ప్రసాద్ ఇంటిపై ఈ దాడి జరిగినట్టు చెబుతున్నారు.

Jamin Rythu
weekly
YSRCP
Mla
kotamreddy
  • Loading...

More Telugu News