Andhra Pradesh: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది.. తగిన ఏర్పాట్లు చేయండి!: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు
  • ఆహారం, తాగునీరు సరిపడా ఏర్పాటు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత, టీటీడీ చైర్మన్

వరుస సెలవులు రావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా భక్తులకు సరిపడా ఆహార పదార్థాలతో పాటు తాగునీటిని కూడా ఏర్పాటు చేయాలని ఈవో గారిని కోరామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా స్థానిక అధికారులు, పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

Andhra Pradesh
Telangana
YSRCP
Jagan
Chief Minister
Twitter
TTD
YV Subba Reddy
  • Loading...

More Telugu News