India: పాక్‌ బహిష్కరణ ఎఫెక్ట్‌... ఇండియాకు చేరుకున్న మన రాయబారి

  • స్వదేశానికి చేరుకున్న బిసారియా
  • 370 అధికరణ రద్దు తర్వాత దాయాది నిర్ణయం
  • ద్వైపాక్షిక సంబంధాలకు తెరదించిన వైనం

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణ రద్దు చేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు తెంపుకొన్న దాయాది పాకిస్థాన్‌ నిర్ణయం మేరకు పాకిస్థాన్‌లో భారత్‌ రాయబారిగా ఉన్న అజయ్ బిసారియా భారత్‌ తిరిగి వచ్చేశారు. తమ దేశంలో ఉన్న భారత్‌ రాయబారిని పాకిస్థాన్‌ బహిష్కరించిన విషయం తెలిసిందే. తక్షణం తమ దేశం విడిచి వెళ్లాల్సిందిగా పాకిస్థాన్‌ కోరడంతో శనివారం ఇస్లామాబాద్‌ను విడిచిపెట్టిన బిసారియా దుబాయ్‌ మీదుగా భారత్‌కు చేరుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దౌత్యపరంగా పాకిస్థాన్‌ తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షించాలని ఆ దేశానికి భారత్‌ విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో హైకమిషనర్‌ తిరిగి రాక అనివార్యమైంది. మరోవైపు మన దేశానికి తమ దేశరాయబారిని పంపడానికి కూడా పాక్‌ నిరాకరించింది.

India
Pakistan
haighcommissioner
returned
  • Loading...

More Telugu News