Andhra Pradesh: సీఎం గారూ.. ‘కారుమంచి’ చెరువును వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు!: కన్నా లక్ష్మీనారాయణ

  • బాలినేని అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారు
  • కారుమంచి చెరువు కబ్జా కాకుండా చర్యలు తీసుకోండి
  • ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖలు రాసిన బీజేపీ రాష్ట్ర చీఫ్

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా కారుమంచి ప్రాంతంలో వైసీపీ నేతలు చెరువును కబ్జా చేస్తున్నారని కన్నా ఆరోపించారు. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు విజయభాస్కర్ రెడ్డి, రమణ పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

రైతులు వ్యవసాయం చేసుకునేందుకు కీలకమైన ఈ చెరువు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కన్నా విజ్ఞప్తి చేశారు. అలాగే గోదావరి వరదల సందర్భంగా నష్టపోయిన ప్రజలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతూ మరో లేఖ రాశారు. వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Andhra Pradesh
Jagan
Chief Minister
Prakasam District
YSRCP
kanna lakshmi narayana
  • Loading...

More Telugu News