Constable: హైదరాబాదులో మహిళను వేధించిన కానిస్టేబుల్... అరెస్ట్

  • డ్యూటీకి సరిగా రాకపోవడంతో సస్పెన్షన్ లో ఉన్న కానిస్టేబుల్
  • ఈ నెల 7న ఓ మహిళ పట్ల అసభ్య ప్రవర్తన
  • అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించిన పోలీసులు

శాంతిభద్రతలను కాపాడాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ దారి తప్పాడు. ఈ నెల 7న లింగస్వామి అనే ఈ కానిస్టేబుల్ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను దూషించడంతో పాటు, దాడి కూడా చేయబోయాడు. దీంతో, బాధితురాలు హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు... లింగస్వామిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. నల్గొండ జిల్లా కొమ్మాయిగూడెంకు చెందిన లింగస్వామి (36) మాదన్న పేట పీఎస్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. గత ఏడాది కాలంలో డ్యూటీకి సరిగా రాకపోవడంతో... ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ కూడా చేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటయ్య మాట్లాడుతూ, కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Constable
Woman
Abuse
Telangana
  • Loading...

More Telugu News