Jana Reddy: ఎస్సై తనను తిట్టాడంటూ మలికిపురం పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన జనసేన ఎమ్మెల్యే రాపాక

  • మలికిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
  • ఎమ్మెల్యేను దూషించిన ఎస్సైని సస్పెండ్ చేయాలంటూ జనసేన కార్యకర్తల డిమాండ్
  • నినాదాలతో హోరెత్తించిన రాపాక అనుచరులు

జనసేన శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ అనూహ్యరీతిలో నిరసనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం ఎస్సై కేవీ రామారావు తనను తీవ్రస్థాయిలో దుర్భాషలాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, మలికిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే రాపాక అనుచరులు భారీగా తరలిరావడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. అన్యాయంగా తమ నేతను దూషించిన ఎస్సై రామారావును సస్పెండ్ చేయాలంటూ జనసేన కార్యకర్తలు పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. అంతేగాకుండా, ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు.

Jana Reddy
Rapaka
  • Loading...

More Telugu News