Jakkampudi Raja: కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా ప్రమాణస్వీకారానికి హాజరైన వీవీ వినాయక్

  • జక్కంపూడి రాజాకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్ సర్కారు
  • విజయవాడలో ప్రమాణస్వీకారం చేసిన జక్కంపూడి రాజా
  • మంచి పేరు తెచ్చుకోవాలని రాజాకు సూచించిన వినాయక్

ఏపీ కాపు కార్పొరేషన్ నూతన చైర్మన్ గా జక్కంపూడి రాజా ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి టాలీవుడ్ దర్శకుడు వీవీ వినాయక్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ, జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం సంతోషదాయకం అన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దివంగత జక్కంపూడి రామ్మోహనరావు వారసుడిగా జక్కంపూడి రాజా మెరుగైన పనితీరుతో రాణించాలని వినాయక్ ఆకాంక్షించారు. ప్రజాభిమానం సంపాదించడంలో జక్కంపూడి రామ్మోహనరావు బాటలోనే రాజా కూడా నడవాలని, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలని సూచించారు.

Jakkampudi Raja
Kapu Corporation Chairman
Jagan
VV Vinayak
  • Loading...

More Telugu News