Sujana Chowdary: ప్రభుత్వ విధానాలతో ఏపీ నుంచి పెట్టుబడిదారులు పారిపోతున్నారు: సుజనా చౌదరి

  • ఏపీ సర్కారుపై సుజనా విమర్శలు
  • భారీ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి వెళుతున్నాయంటూ వ్యాఖ్యలు
  • స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అనేది రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలతో అసంతృప్తికి గురవుతున్న పెట్టుబడిదారులు పారిపోయే పరిస్థితి నెలకొందని విమర్శించారు. భారీ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అనేది రాజ్యాంగ విరుద్ధమని, ఇలాంటి నిర్ణయాలతో పరిశ్రమలను ఆకర్షించడం కష్టమని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజక్టును ఏ కాంట్రాక్టర్ నిర్మిస్తున్నారన్నది ఇప్పుడు ముఖ్యం కాదని, పోలవరం ప్రాజక్టు పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని సుజనా హితవు పలికారు. ఎంతో కీలకమైన దశలో కాంట్రాక్టర్ మారితే పోలవరం ప్రాజక్టుపై ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని హెచ్చరించారు.

Sujana Chowdary
Jagan
YSRCP
Andhra Pradesh
BJP
  • Loading...

More Telugu News