Vijayawada: విజయవాడలో దారుణం..భార్య తల నరికి కిరాతకంగా హత్య చేసిన భర్త

  • సత్యనారాయణపురంలో పట్టపగలే నడిరోడ్డుపై ఘటన
  • ప్రేమ వివాహం.. భార్యభర్తల మధ్య విభేదాలు
  • భార్య తల నరికి ఆపై కాల్వలో పడేసిన భర్త

విజయవాడలో దారుణం జరిగింది. స్థానిక సత్యనారాయణపురంలో భార్య తలను భర్త కిరాతకంగా నరికి హత్య చేశాడు. పట్టపగలే నడిరోడ్డుపై ఈ సంఘటన జరిగింది. హత్య చేసిన అనంతరం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో నిందితుడు లొంగిపోయాడు. భార్యభర్తల మధ్య వివాదాల వల్లే ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

సత్యనారాయణపురంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రదీప్, మణిక్రాంతి ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే తన భార్య తలను ప్రదీప్ నరికేశాడు. నరికేసిన తలను బుడమేరు కాలువలో పడేసి, ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడని సమాచారం. తనను ఇబ్బంది పెట్టడం వల్లే తన భార్య తలను నరికేశానని ప్రదీప్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా, వీళ్లిద్దరూ విడాకులు కోరుతూ కోర్టుకు దరఖాస్తుచేసుకున్నారని, భర్త ప్రదీప్ తనను హింసిస్తున్నాడంటూ మణిక్రాంతి పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Vijayawada
satyanarayanapuram
srinagar
murder
  • Loading...

More Telugu News