YSRCP: వైసీపీ సోషల్ మీడియా వాలంటీర్లపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేస్తాం: విజయసాయిరెడ్డి

  • తాడేపల్లిలో వాలంటీర్ల ఆత్మీయ సమావేశం 
  • సోషల్ మీడియా వాలంటీర్ల కృషి మరువలేనిది
  • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉంది: విజయసాయిరెడ్డి

గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ సోషల్ మీడియా వాలంటీర్ల ఆత్మీయ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. వైసీపీ సోషల్ మీడియా వాలంటీర్ల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, సోషల్ మీడియా వాలంటీర్ల కృషి మరువలేనిదని, గత ప్రభుత్వంలో వాలంటీర్లపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందని సూచించారు. అవినీతి రహిత పాలనకు జగన్ చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.

YSRCP
Social Media
vijayasai reddy
Volunteers
  • Loading...

More Telugu News