Jagan: జగన్ అనవసర విషయాల్లో అత్యుత్సాహం చూపుతున్నారు: కన్నా విసుర్లు

  • గుంటూరులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
  • హాజరైన కన్నా లక్ష్మీనారాయణ
  • జగన్ ఇసుక విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ అసంతృప్తి

ఏపీ సీఎం జగన్ అనవసర విషయాల్లో అత్యుత్సాహం చూపుతూ, అవసరమైన విషయాలను మాత్రం పట్టించుకోవడంలేదంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరు చంద్రమౌళి నగర్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ రంగంలో ఎంతో కీలకమైన ఇసుక విషయంలో జగన్ ఎంతుకు తాత్సారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇసుక సరఫరా లేక ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వానికి ఆత్రమే తప్ప శ్రద్ధ కొరవడిందని అన్నారు. జగన్ చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన కనిపించడంలేదని తెలిపారు.

Jagan
Kanna
BJP
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News