Ramcharan: రామ్ చరణ్ కు కూడా జాతీయ అవార్డు రావాల్సింది: మంచు విష్ణు

  • జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు చిత్రాలు
  • రంగస్థలంలో అద్భుతంగా నటించాడంటూ రామ్ చరణ్ కు కితాబిచ్చిన మంచు విష్ణు
  • ఇటీవల కాలంలో చరణ్ దే అత్యుత్తమ నటనా ప్రదర్శన అంటూ ప్రశంస

తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు గణనీయమైన స్థాయిలో పురస్కారాలు లభించడం తెలిసిందే. అయితే, రంగస్థలం చిత్రంలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్ కు కూడా జాతీయ అవార్డు ఇవ్వాల్సిందని నటుడు మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. ఇతర అవార్డు గ్రహీతల విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, రంగస్థలం చిత్రంలో ఉదాత్తమైన నటన కనబర్చిన రామ్ చరణ్ కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకునే అర్హత ఉందని తాను భావిస్తున్నానని విష్ణు ట్వీట్ చేశారు.

ఈ మధ్య కాలంలో ఇంతకుమించిన నటనా ప్రదర్శన మరొకటి లేదని, అయినా అభిమానుల ప్రేమ అవార్డుల కంటే గొప్పదని పేర్కొన్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో చెర్రీ నటన విమర్శకులను సైతం మెప్పించింది. సమంతతో జంటగా ఓ చెవిటివాడి పాత్రలో జీవించేశాడంటూ మెగా హీరోపై ప్రశంసల వర్షం కురిసింది.

Ramcharan
Manchu Vishnu
National Awards
Rangasthalam
  • Loading...

More Telugu News