Miley Cyrus: ఏడాదికే పెళ్లి పెటాకులు.. విడిపోయిన మైలీ సైరస్-లియమ్ హేమ్స్ వర్త్!

  • కెరీర్ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని వెల్లడి
  • కొన్నేళ్లుగా డేటింగ్ చేసిన జంట
  • గతేడాది డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటైన జంట

హాలీవుడ్ సెలబ్రిటీ జంట లియమ్ హేమ్స్ వర్త్, మైలీ సైరస్ విడిపోయారు. వివాహామై ఏడాది కూడా కాకముందే వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ విషయమై మైలీ సైరస్ ప్రతినిధి మాట్లాడుతూ..‘ఇద్దరి కెరీర్ దృష్ట్యా వివాహ బంధాన్ని రద్దుచేసుకోవాలని సైరస్, హేమ్స్ వర్త్ ఓ అంగీకారానికి వచ్చారు. తమ పెంపుడు జంతువుల సంరక్షణను సైరస్-హేమ్స్ వర్త్ కలిసి చేపడతారు’ అని తెలిపారు.

కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన మైలీ సైరస్-లియమ్ హేమ్స్ వర్త్ 2018, డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ తొలిసారి 2010లో విడుదలైన  ది లాస్ట్ సాంగ్ అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించారు. రెకింగ్ బాల్, పార్టీ ఇన్ ది యూఎస్ఏ, వుయ్ కెనాట్ స్టాప్ వంటి పాటలతో మైలీ సైరస్ ఫేమస్ అయ్యారు. హంగర్ గేమ్స్, ఇండిపెండెన్స్ డేస్, పారనోయా, ఎంపైర్ స్టేట్ సినిమాలతో హేమ్స్ వర్త్ కు మంచి గుర్తింపు వచ్చింది.

Miley Cyrus
Liam Hemsworth
Split
Less Than A Year Of Marriage
hollywood
actor
singer
  • Loading...

More Telugu News