Varla Ramaiah: ఈ ప్రభుత్వాన్ని ఎందుకు పొగడాలో అంబటి గారు సెలవివ్వాలి: వర్ల రామయ్య

  • చంద్రబాబుపై వెటకారాలు సరికాదంటూ అంబటిపై ఫైర్
  • 70 రోజుల పాలన సమీక్షించుకోవాలంటూ హితవు
  • ట్వీట్లు చేసిన వర్ల

టీడీపీ నేత వర్ల రామయ్య వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు. తమ అధినేత చంద్రబాబును అంబటి వెటకారంగా మాట్లాడుతున్నారంటూ వర్ల మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఏ విషయంలో పొగడాలని నిలదీశారు. "శాంతిభద్రతలు దారుణంగా విఫలమైనందుకు పొగడాలా? ఇసుక కృత్రిమ కొరత సృష్టించినందుకు పొగడాలా? పింఛన్లు ఆలస్యంగా ఇస్తున్నందుకు పొగడాలా? మద్యపాన వినియోగం విపరీతంగా పెంచినందుకు పొగడాలా? 45 ఏళ్లకే పింఛన్లు ఇస్తాం అని చెప్పి మాట తప్పినందుకు పొగడాలా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు మీ ప్రభుత్వాన్ని పొగడాలో అంబటి గారు సెలవివ్వాలి అంటూ వర్ల రామయ్య వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ 70 రోజుల పాలన సమీక్షించుకోవాలని, ఇకనైనా కళ్లు తెరిచి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.

Varla Ramaiah
Chandrababu
Ambati Rambabu
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News