Andhra Pradesh: నెల్లూరులో టీడీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చేస్తున్నారు!: చంద్రబాబు ఆగ్రహం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-502fbcf3c72731b7eb8d8c230de576e02538b903.jpg)
- టీడీపీకి ఓటేయడంతో వీరిని లక్ష్యంగా చేసుకున్నారు
- ఇలాంటి చర్యలను ఇప్పటికైనా ఆపాలి
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వరపురం, జనార్థనరెడ్డి కాలనీలో అక్రమ నిర్మాణాల పేరుతో టీడీపీ కార్యకర్తల ఇళ్లు కూల్చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
కేవలం టీడీపీకి ఓటేశారన్న కారణంతో తమ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఆపాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు హెచ్చరించారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.