Nani: తొలిసారి విలన్ గా నాని... లుక్ లీక్!

  • 'వి' చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర
  • ఇంద్రగంటి దర్శకత్వంలో నాని 25వ చిత్రం
  • వైరల్ అవుతున్న లుక్

నేచురల్‌ స్టార్‌ గా తెలుగు చిత్రసీమలో పేరు తెచ్చుకున్న నాని, తన 25వ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా 'వి' తెరకెక్కుతోంది. సినిమాలో నానీకి సంబంధించిన లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నానీ సరిగ్గా కనిపించకపోయినా, అది నానీ లుక్కేనని తెలిసిపోతోంది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న 'వి' చిత్రంలో సుధీర్ బాబు, అదితీ రావ్‌ హైదరీ, నివేదా థామస్‌ లు కూడా నటిస్తున్నారు.

Nani
Villain
Look
Social Media
  • Loading...

More Telugu News