isis: భారత్‌పై ఐసిస్‌ గురి...స్వాతంత్య్రదినోత్సవం రోజు విధ్వంసానికి కుట్ర

  • జైషే, లష్కరే తొయిబా ఉగ్రవాదుల ప్లాన్‌
  • నిఘా వర్గాల హెచ్చరిక
  • భద్రతా దళాలను అప్రమత్తం చేసిన అధికారులు

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణ రద్దు అనంతరం ఉగ్రవాదులు భారత్‌లో విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని ఊహిస్తున్నట్లే నిఘా వర్గాలు కూడా సమాచారం అందిస్తున్నాయి. ఐసిస్‌ మద్దతుతో జైషే, లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఈనెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ విధ్వంసానికి కుట్ర చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సమాచారం అందించాయి. బక్రీద్‌ ప్రార్థనల్లోనూ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

దీంతో అధికారులు భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. భారత్‌ తీసుకున్న నిర్ణయం వల్ల మరిన్ని పుల్వామా దాడులు జరిగే అవకాశం ఉందని స్వయంగా పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆ దేశ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఈ మాటల వల్లే ఉగ్రమూకలు మరింత రెచ్చిపోతున్నాయనేది ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News