Uttam Kumar Reddy: సోనియా పునరాగమనంతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • ఆమె నియామకంపై హర్షం
  • ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం
  • తెలుగుప్రజల గుండెల్లో ఆమెకు ప్రత్యేక స్థానం

తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న సోనియాగాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలిగా పునరాగమనంతో పార్టీకి పూర్వ వైభవం ఖాయమని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. నిన్న దేశరాజధాని ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలిగా తిరిగి సోనియానే నియమిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

దీనిపై దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల నుంచి హర్షం వ్యక్తమవుతుండగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా గొంతుకలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోనియా నియామకం ఎంతో సరైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.

Uttam Kumar Reddy
Sonia Gandhi
AICC president
  • Loading...

More Telugu News