Jakkampudi Raja: ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి ప్రమాణం!

  • విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ప్రమాణం
  • ఇటీవలే చైర్మన్ గా నియమితులైన జక్కంపూడి రాజా
  • బాధ్యతలు స్వీకరించిన రాజా

ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ గా రాజానగరం ఎమ్మెల్యే, వైసీపీ నేత జక్కంపూడి రాజా కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉదయం 10 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. జక్కంపూడి రాజాను చైర్మన్‌ గా నియమిస్తూ ఇటీవలే ఉత్తర్వులు విడుదలైన సంగతి తెలిసిందే. దివంగత జక్కంపూడి కుమారుడు కావడం, కాపు యువతలో ఉన్న మంచి పేరు కారణంగా సీఎం వైఎస్ జగన్, ఈ పదవిని రాజాకు అప్పగించారు.

కాగా, రాజా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కాపు కార్యకర్తలు, నేతలు శనివారమే విజయవాడకు చేరుకోవడం గమనార్హం.

Jakkampudi Raja
Kapu
Corporation
Chairman
Jagan
  • Loading...

More Telugu News