manohar lal khattar: నేనలా అనలేదు.. కావాలంటే వీడియో చూసుకోండి: వీడియో షేర్ చేసిన హరియాణా సీఎం

  • కశ్మీరీ అమ్మాయిలను తెచ్చుకోవచ్చంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఆర్టికల్ 370 రద్దుతో లైన్ క్లియర్ అయిందని వ్యాఖ్య
  • తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వీడియో షేర్ చేసిన సీఎం

కశ్మీర్ అమ్మాయిలను పెళ్లాడేందుకు ఇప్పుడు మార్గం సుగమం అయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు తాను చేసిన వ్యాఖ్యల పూర్తి వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ‘అమ్మాయిలు మాకు గర్వకారణం’ అని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి ప్రచారం చేశారని దుయ్యబట్టారు. కశ్మీరీ అమ్మాయలపై తానేమీ తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఖట్టర్ మాట్లాడుతూ.. బీహార్ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని తమ మంత్రులు చెబుతుంటారని, కానీ ఇప్పుడా అవసరం లేదని, ఇకపై కశ్మీర్ నుంచి కోడళ్లను తెచ్చుకోవచ్చని, ఆర్టికల్ 370 రద్దుతో ఇందుకు మార్గం సుగమం అయిందని పేర్కొన్నారు. కశ్మీరీ అమ్మాయిలను భార్యలుగా, కోడళ్లుగా తెచ్చుకునేందుకు అందరూ ఇష్టపడతారని వ్యాఖ్యానించి విమర్శలు మూటగట్టుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఖట్టర్ స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు.

manohar lal khattar
Haryana
kashmir girls
marriage
  • Loading...

More Telugu News