Kurnool District: శతాధిక వృద్ధుడికి గుండె ఆపరేషన్.. విజయవంతం చేసిన వైద్యులు!

  • అయోటిక్ వాల్వ్‌స్టెనోసిస్ వ్యాధితో బాధపడుతున్న వృద్ధుడు
  • ఈ నెల 2న విజయవంతంగా ఆపరేషన్
  • శనివారం వృద్ధుడి డిశ్చార్జ్

గత రెండేళ్లుగా అయోటిక్ వాల్వ్‌స్టెనోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్న 101 ఏళ్ల వృద్ధుడికి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. బనగానపల్లెకు చెందిన వెంకటస్వామి రెండేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన కర్నూలులోని శాంతిరాం ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఈ నెల రెండో తేదీన వాల్వు రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేశారు.

అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న వెంకటస్వామిని శనివారం డిశ్చార్జ్ చేసినట్టు గుండె శస్త్ర చికిత్స నిపుణుడు మురళీహరీశ్ తెలిపారు. శతాధిక వృద్ధుడికి చేసిన గుండె ఆపరేషన్ విజయవంతం కావడంపై ఆసుపత్రి వైద్యులు, వెంకటస్వామి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Kurnool District
heart operation
Andhra Pradesh
shantiram hospital
  • Loading...

More Telugu News