siler crown: 50 ఏళ్ల క్రితం చోరీ అయిన వెండి కిరీటం.. చిత్తుకాగితాల్లో లభ్యం!

  • 1955లో వెండి కిరీటాన్ని తయారుచేయించిన రాచకొండ గోపాలకృష్ణయ్య దంపతులు
  • చంద్రశేఖరస్వామి ఆలయానికి బహూకరణ
  • 1968లో కిరీటం చోరీ

50 ఏళ్ల క్రితం చోరీ అయిన ఓ వెండి కిరీటం చిత్తు కాగితాలు ఏరుకునే వారికి దొరికింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పది రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. తమకు దొరికిన వెండి కిరీటాన్ని వారు స్థానిక బంగారు వర్తకుడికి చూపించారు. దానిని పరిశీలించిన ఆయన  గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడిలోని చంద్రశేఖరస్వామి ఆలయానికి చెందినదిగా గుర్తించారు.

1955లో 300 గ్రాముల వెండితో రాచకొండ గోపాలకృష్ణయ్య- వెంకటసుబ్బమ్మ దంపతులు ఈ కిరీటాన్ని చేయించినట్టు కిరీటంపై రాసి ఉంది. దీనిని వారు ఆలయానికి బహూకరించారు. 1968లో ఈ కిరీటాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అది ఏమైందన్నది తెలియరాలేదు. తాజాగా చిత్తుకాగితాలు ఏరుకునే వారికి దొరికింది. దీనిని స్వాధీనం చేసుకున్న పోలీసులు చంద్రశేఖరస్వామి ఆలయ ఈవోకు అందజేశారు.

  • Loading...

More Telugu News